దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా || ||దేవునికి దేవికిని||
ధర్మార్థకామమోక్షతతులు నీ సోబనాలు
అర్మిలి నాలుగు వేదాలదె నీదరులు
నిర్మలపు నీజలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీలోతు వో కేనేరమ్మా || ||దేవునికి దేవికిని||
తగిన గంగాది తీర్థములు నీకడళ్లు
జగతి దేవతలు నీ జలజంతులు
గగనపు పుణ్యలోకాలు నీ దరిమేడలు
మొగినీ చుట్టుమాకులు మునులోయమ్మా || ||దేవునికి దేవికిని||
వైకుంఠనగరము వాకిలే నీయాకారము
చేకొను పుణ్యములే నీ జీవభావము
యేకడను శ్రీవేంకటేశుడే నీవునికి
దీకొని నీతీర్థ మాడితిమె కావవమ్మా || ||దేవునికి దేవికిని||