రాగం : శంకరాభరణం
దనుజులు గనిరి తత్త్వమిది
వనజాక్షుని కృప వసించ నేలా! || దనుజులు ||
హరి పరమాత్ము డనాది పురుషుడు
సురులకు నరులకు సులభుడు
హరి కోపముతో నన్యుల వరములు
సరిగా వెంచగ జగములలోన ! || దనుజులు ||
వేదాంత విదుడు విష్ణుడు కృష్ణుడు
శ్రీదేవికి బతి శేఖరుడు
పోది బరస్తుతి పుణ్యముకంటే
పాదుగ హరి దిట్టే పాపము మేలు! || దనుజులు ||
నారాయణు డున్నతు డచ్యుతుడుప
కారుడు శ్రీవేంకటవిభుడు
చేరి యీతడే శిక్షించ రక్షించ
వూర దయివములు వొగి నితని సరా! || దనుజులు ||