రాగం : నాట
చక్రమా హరి చక్రమా
వక్రమైన దానవుల వక్కలించవో || చక్రమా ||
చుట్టి చుట్టి పతాళము చొచ్చి హిరణ్యాక్షుని
చట్టలు చీరిన ఓ చక్రమా
పట్టిన శ్రీహరిచేత పాయక ఈ జగములు
ఒట్టుకొని కావగదవొ ఓ చక్రమా || చక్రమా ||
పానుకొని దనుజుల బలుకిరీట మణుల
సానలు తీరిన ఓ చక్రమా
నానా జీవముల ప్రాణములు గాచి ధర్మ-
మూని నిలుపగదవొ ఓ చక్రమా || చక్రమా ||
వెరచి బ్రహ్మాదులు వేదమంత్రముల నీ
వరుట్లుకొనియాడే రో చక్రమా
అఱిముఱి తిరువేంకటాద్రీశు వీధుల
ఒరపుల మెరయుదువో ఓ చక్రమా || చక్రమా ||