Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : ఘుమ్మని

రాగం : పూర్వి కళ్యాణి

ఘుమ్మనియెడి శృతి కూడగను
కమ్మని నేతులు కాగగ చెలగె || ఘుమ్మని ||

నీల వర్ణుడని నీరజాక్షుడని
బాలుని నతివలు పాడేరో
పాలు పిదుకుచును బానల కాగుల
సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగే || ఘుమ్మని ||

మందరధరుడని మాధవుడని గో-
విందుని పాడేరు వెలదులిదే
నంద వ్రజమున నలుగడ నావుల
మందుల పేయలు మంచిరవముల || ఘుమ్మని ||

వేంకటపతియని వేదనిలయుడని
పంకజనాభుని పాడేరు
అంకుల చేతను అలరు రవంబుల
బింకపు మాటల బృందావనమున || ఘుమ్మని ||

Advertisement

తాజా వార్తలు

Advertisement