Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : కొలువైవున్నాడు వీడె

ప|| కొలువై వున్నాడు వీడె గోవిందరాజు
కొల కొల నేగి వచ్చే గోవిందరాజు || కొలువైవున్నాడు ||

చ|| గొడుగుల నీడల గోవిందరాజు
గుడిగొన్న పడగెల గోవిందరాజు
కుడియెడమ కాంతల గోవిందరాజు
కొడిసాగె పవుజుల గోవిందరాజు || కొలువైవున్నాడు ||

చ|| గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు
గుప్పేటి వింజామరల గోవిందరాజు
కొప్పుపై చుంగుల తోడి గోవిందరాజు
కుప్పి కటారము తోడి గోవిందరాజు || కొలువైవున్నాడు ||

చ|| గొరబు సింగారాల గోవిందరాజు
కురులు దువ్వించుకొని గోవిందరాజు
తిరుపతిలోనను తిరమై శ్రీ వేంకటాద్రి
కురిసీ వరము లెల్ల గోవిందరాజు || కొలువైవున్నాడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement