రాగం : తిలంగ్
ఔనయ్యా జాణడవు ప్రహ్లాద వరద
ఆనలు వెట్టకుము ప్రహ్లాద వరద || ఔనయ్యా ||
వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వీ
ఆసలు చూపేవు ప్రహ్లాద వరద
సేస వెట్టిన చేతుల చెరగువట్టి తీసేవు
ఆ సుద్దులు చెప్పేను ప్రహ్లాద వరద || ఔనయ్యా ||
నంటున తొడమీదను నలినాక్ష్మినెక్కించుక
అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద
గెంటక ఏ పోద్దును కేలు కేలు కీలించుక
అంటువాయ వదివో ప్రహ్లాద వరద || ఔనయ్యా ||
కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి
వందముగ నీకెను ప్రహ్లాద వరద
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన
అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద || ఔనయ్యా ||