రాగం : ఖరహరప్రియ
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండె || ఒకపరి ||
జగదేకపతిమేన చల్లిన కర్పూర ధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరువెన్నెల దిగబోసి నట్లుండె || ఒకపరి ||
పొరి మెఱుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరిగి ఇరుదెసల కారగాను
కరిగమన వి భుడు గనుక మోహమదము
తొరిగి సామజ సిరి తొలికినట్లుండె || ఒకపరి ||
మెఱయు శ్రీవేంకటేశు మేన సింగారముగాను
త రచైన సొమ్ములు ధరిం యించగా
మెఱుగు బోణీ అలుమేలు మంగయు తాను
మెఱుపు మేఘము గూడి మెఱసినట్లుండె || ఒకపరి ||