రాగం – అహీర భైరవ
తాళం – ఆది
ప|| ఎదుట నున్నాడు వీడే ఈ బాలుడు
మది తెలియమమ్మ ఏమరులోకాని || ఎదుట ||
చ|| పరమ పురుషుడట పసుల గాచెనట
సరవులెంచిన విన సంగతాయిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని || ఎదుట ||
చ|| వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
అందించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూల మీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులెట్టికతలో కాని || ఎదుట ||
చ|| అలబ్రహ్మతండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్పకూడునా యిది
తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తన కెంతో కరుణో కాని || ఎదుట ||