ఇతడే పరబ్రహ్మ మిదియే రామకథ
శతకోటి విస్తరము సర్వపుణ్యఫలము
ధరలో రాముడు పుట్టె ధరణిజబెండ్లాడె
అరణ్యవాసులకెల్లా నభయమిచ్చె
సొరిది ముక్కు జెవులు చుప్పనాతిని గోసె
ఖరదూషణులను ఖండించి వేసె
కినిసి వాలిజంపి కిష్కింధ సుగ్రీవు కిచ్చె
వనధి బంధించి దాటె వానరులతో
కనలి రావణకుంభకర్ణాదులను జంపి
వనితజేకొని మళ్ళి వచ్చె నయోధ్యకును
సౌమిత్రియు భరతుడు శత్రుఘ్నుడు గొలువగ
భూమి యేలె కుశలవపుత్రుల గాంచె
శ్రీ మంతుడై నిలిచె శ్రీ వేంకటాద్రిమీద
కామించి విభీషణ లంకకు బట్టము గట్టె