Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : అయ్యో పోయన

రాగం : శివరంజని
అయ్యో పోయబ్రాయముకాలము
మెయ్యంచుమన సుననే మోహమతినైతి || ||అయ్యో పోయన||

చుట్టుంబులాతనకు సుతులుకాంతులుచెలులు
వట్టియాసలు వెట్టు వారేకాక
నెట్టుకొని వీరు కడునిజమనుచు హరినాత్మ
బెట్టనేరక వృథా పిరి వీకులైతి || ||అయ్యో పోయన||

తగుబంధులా తనకు తల్లులును తండ్రులును
వగల వెట్టుచు తిరుగు వారేకాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
తగిలించలేక చింతాపరుడనైతి || ||అయ్యో పోయన||

అంతహితులా తనకు అన్నలును తమ్ములును
వంతువాసికి (బె)నగువారే కాక
అంతరాత్ముడు శ్రీవేంకటాద్రీశు కొలువకిటు
సంతకూటముల అలజడికి లోనైతి || ||అయ్యో పోయన||

Advertisement

తాజా వార్తలు

Advertisement