రాగం : దేవగాంధారి
అమరెగదె నేడు అన్ని సొబగులును
దమరతి చిన్నలు సతి నీ మేన || ||అమరెగదె నేడు||
చెలపట చెమటలు చెక్కిళ్ళ
మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుక చొక్కిళ్ళ
తొలగని యాసలు తొక్కిళ్ళ || ||అమరెగదె నేడు||
నెరవగు చూపులు నిక్కిళ్ళ
మెఱసెను తమ…ము మిక్కిళ్ళ
గుఱుతగు నధరము గుక్కిళ్ళ
తఱచగు వలపులు దక్కిళ్ళ || ||అమరెగదె నేడు||
ననుగోరికొనలు నొక్కిళ్ళ
పొనుగని తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీ వేంకటపతి కౌగిట
ఎనసెను పంతము లెక్కిళ్ళ || ||అమరెగదె నేడు||