రాగం : ఆరభి
అప్పులవారే అందరును
కప్పగ దిప్పగ కర్తలు వేరీ || ||అప్పులవారే||
ఎక్కడ చూచిన నీ ప్రపంచమున
చిక్కులు సిలుగులు చింతలునే
దిక్కెవ్వరు యీ తి దీపులలో
దిక్కుముక్కులకు దేవుడెకాక || ||అప్పులవారే||
యేది తలంచిన నేకాలంబును
సూదులమాటల సుఖములివి
కాదన నౌ నన కడ కనిపించగ
పోదికాడు తలపున గల దొకడే || ||అప్పులవారే||
యెన్నడు వీడే నెప్పుడ వాసీ
పన్నిన తమ తమ బంధములు
పున్నతి సేయగ వొప్పుఉ నెరపగ
వెన్నుడు వేంకట విభుడే కలడు || ||అప్పులవారే||