రాగం : ఖరహరిప్రియ
ప|| అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము ||
చ|| చిత్తశాంతికిని శ్రీపతినామమె
హత్తిన నిజ దివ్యౌషధము
మొత్తపు బంధ విమోచనంబునకు
చిత్తజగురుడే సిద్ధౌషధము ||
చ|| పరిపరి విధముల భవరోగములకు
హరిపాదజలమె ఔషధము
దురిత కర్మముల తొలగించుటకు
మురహర పూజే ముఖ్యౌషధము ||
చ|| యిల నిహపరముల ఇందిరా వి భుని
అలరి భజింపుటె ఔషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమే
నిలిచిన మాకిది నిత్యౌషధము ||