Wednesday, November 20, 2024

అన్నమయ్య కీర్తనలు : అనరాదు వినరాదు

రాగం : దేశాక్షి

ప|| అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయ ద్రిష్టమిదే మాకు ||

చ|| ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతోజెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయనమ్మా ||

చ|| తీట తీగెలు సొమ్మంటా దేహము నిండాగట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను
కోటి కోటి సొమ్ములాయ కొత్తలో యమ్మా ||

చ|| కాకిజున్ను జున్ను లంటా గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా
ఆకడ శ్రీ వేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలు సేసెజూడగానే వేము ||

Advertisement

తాజా వార్తలు

Advertisement