రాగం : సరస్వతి
అతని పాడెదను అది వ్రతము
చతురుని శేషాచల నివాసుని|| ||అతని పాడెదను||
సనకాదులు ఏ సర్వేశుగొలిచిరి
అనిశము శుకుడెవ్వని దలచె
మును ధృవుడేదేవుని నన్నుతించె
ఘన నారదు డేఘనుని పొగడెను|| ||అతని పాడెదను||
ఎలమి విభీషణు డేదేవుని శరణనె
తలచె భీ ు్ష్తడే దైవమును
బలు ప్రహ్లాదుని ప్రాణశుడెవ్వడు
ఇలలో వశిష్ఠు డేమూర్తి దెలిసె|| ||అతని పాడెదను||
పురిగొని వ్యాసు డేపురుషుని చెప్పెను
తిరముగ అర్జునుని దిక్కెవ్వడు
మరిగిన అలమేల్మంగపతి ఎవ్వడు
గరమిల శ్రీ వేంకటేశుడీతడు|| ||అతని పాడెదను||