Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : అందరికాధారమైన

రాగం : మధ్యమావతి

ప|| అందరికాధారమైన ఆదిపురుషుడీతడు
విందైమున్నారగించె విదురునికడ నీతడు

చ|| సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజభవాదులకును దైవంబైనతడీతడు
యినమండలమున చెలగే హితవైభవుడీతడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు

చ|| సిరులొసగి యశోదయింట శిశువైన తడీతడు
ధరనావుల మందలలో తగచరించె నీతడు
సరసతలను గొల్లెతలకు జనపులొసగె నీతడు
అరసి కుచేలుని అటుకులు ఆరగించె నీతడు

చ|| పంకజభవునకు బ్రహ్మ పదమొసగెను యీతడు
సంకీర్తనాద్యులచే జట్టిగొనియె నీతడు
తెంకిక నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసినఘను డీతడు

Advertisement

తాజా వార్తలు

Advertisement