పాండవులు కౌరవుల మధ్య యుద్ధం మొదలవబోతున్నది.కృష్ణు డు యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణు డు ఆయన కొడుకు అశ్వద్ధామ, కర్ణుడులాంటి యోధులున్నారని కృష్ణుడికి తెలుసు. అశ్వద్ధామ చిరంజీవి. కౌరవుల పక్షంలో అశ్వద్ధా మ సైన్యాధిపతి అయితే పాండవులు గెలవలేరని కృష్ణుడు ఆలోచించి హస్తినాపురం వెళ్ళాడు. సభలోని అందరికి నమస్కరించి అశ్వ ద్ధామని ఒంటరిగాతీసుకెళ్ళాడు. దుర్యోధనుడు ఇది గమనించాడు. కృష్ణుడు అశ్వద్ధామ క్షేమసమాచారాలు అడుగుతూనే తన ఉంగ రాన్ని కిందకు జారవిడిచాడు. అది చూసిన అశ్వద్ధామ వంగి దాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడాడు.కృష్ణుడు ఏం చూపిస్తున్నాడో అని ఆకాశంవైపు చూసిన తరువాత అశ్వద్ధామ కృష్ణుడి వేలికి కిందపడ్డ ఉంగరాన్ని తొడిగాడు. ఇదంతా గమనిస్తు న్న దుర్యోధనుడు, అశ్వద్ధామ ”నేను కౌరవులపక్షంలో ఉన్నా పాం డవుల గెలుపుకు తోడ్పడతానని నింగినేల సాక్షిగా ప్రమాణం చేస్తు న్నాను” అన్నట్లు అర్థం చేసుకున్నాడు. ఈ అనుమానంతోనే చివరి వరకు అశ్వద్ధామను సైన్యాధిపతిగా నియమించలేదు. కురుక్షేత్రం 17వరోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయాడు అశ్వద్ధామ దుర్యోధనుడి వద్దకు వచ్చి ”నేను చిరం జీవి వరంపొందానని తెలుసుకదా! నన్ను సేనాధిపతిగా నియమిం చివుంటే యుద్ధంలో మనంగెలిచేవారం”అంటాడు. అప్పుడు దుర్యో ధనుడు ”నువ్వు పాండవులకు సహాయం చేస్తానని కృష్ణుడికి మాటి చ్చావు కదా” అంటాడు. ”ఎవరు మాటఇచ్చింది” అని అశ్వద్ధామ అడగ్గా అక్కడ జరిగింది, తాను అర్థంచేసుకున్నది దుర్యోధనుడు చెబుతాడు. ఆమాటలకు అశ్వద్ధామ విరక్తితో నవ్వి ”కృష్ణుడి ఉంగ రం జారిపడిపోతే తీసి ఇచ్చాను. ఎటువంటి మాటఇవ్వలేదు. నాపై నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు. అప్పుడే ఈవిషయం అడిగితే నిజం తెలిసేది, ఇదికూడా ఆ పరమా త్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుం ది” అంటాడు. నిజమే అనుమానంవస్తే వెంటనే అడిగేయడం ఉత్త మం అంతేకానీ మనసులో దాచుకుంటే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు. అనుమానం పెనుభూతం అనే మాట నిజ మే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.
Advertisement
తాజా వార్తలు
Advertisement