ఇతరుల ప్రభావం నీపై పడకుండా ఉండటానికి నీకు శక్తి అవసరము. ఈ శక్తి పేరు – అనాసక్తత. ప్రభావితం కాకుండా అనాసక్తతో ఉండలేకపోతే నీ ఆలోచనలను నియంత్రించలేవు. అలా అలా లోపల ఉన్న మంచి అంతా తగ్గుతూ వస్తుంది.
అనాసక్తతో మొదటి మెట్టు – నిన్ను నీవు ఒక ఆత్మిక ఉనికి కలిగిన చైతన్య శక్తి అని గుర్తించడము. అప్పుడు నీ భౌతిక ఉనికి, దాని హద్దు భావాల నుండి ‘అనాసక్తత’ మొదలై నీ ఆధ్యాత్మిక వ్యక్తిత్వమైన ఆంతరిక శాంతి, శక్తిపై ‘ఆసక్తి’ పెరుగుతుంది.
ఈ అనాసక్త దైనందిన జీవితంలో ఎన్నో సవాళ్లను విసురుతుంది. ఒకవైపు నీకున్న ఆత్మిక అవగాహన, మరో వ్యక్తులు, భౌతిక వస్తువులపై ఆకర్షణ. అనాసక్తత అంటే వ్యక్తులు, వస్తువుల నుండి దూరమవడం కాదు. స్వయం ఒక ఆధ్యాత్మిక ఉనికి కలిగి ఉండి ఈ ప్రపంచంలో నా పాత్రను అభినయిస్తున్నాను అన్న స్మృతిలో ఉం డటము. ఒక మాటలో చెప్పాలంటే అనాసక్తత అనగా ఆధ్యాత్మికతలో స్వయాన్ని కేంద్రీకరించడము.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి