నిన్ను నీవు క్రొత్తగా అర్థం చేసుకోవాలంటే అనారోగ్యం ఒక చక్కని అవకాశము. మరి ఈ అవకాశాన్ని అర్థం చేసుకుని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నావా లేక
అనారోగ్యంతో అతిగా కలవరపడుతూ అందులోని లాభాన్ని తీసుకోలేకపోతున్నావా? ఒక వేళ అలా అయితే నాలో మరింకేదైనా అనారోగ్యం ఉందా అని నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
బాహ్య అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి ఎలా అయితే హాస్పిటల్‌కు వెళ్ళి, డాక్టరును కలిసి మంచి సదుపాయం ఉన్న మంచం తీసుకుని పోషకాహారాలను తీసుకుంటూ ఉంటామో ఆంతరిక అనారోగ్యానికి కూడా ఇలాగే చెయ్యాలి. ఆత్మల ప్రపంచానికి వెళ్ళాలి, అక్కడ సుప్రీమ్ డాక్టర్ ఉంటారు. అతని స్మృతి అను చక్కని మంచంపై వి శ్రాంతి తీసుకుంటూ పవిత్రమైన, సకారాత్మక ఆలోచనలు అను భోజనాన్ని స్వీకరిస్తూ ఉండాలి.
భౌతికస్థితికి అతీతంగా మనసును ఉంచి నీలోని ఈ అంతర్గత శక్తులైన శాంతి, మౌనముతో ఉండగలగడాన్ని నేర్పించడానికి ఈ అనారోగ్యం ఒక చక్కని అవకాశం. ఇదే అత్యద్భుత వైద్యం.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి