శ్రీకృష్ణ భగవానుడికి ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులున్నారు. చాలా దేశాలలో అధునాతన ‘ఇస్కాన్’ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలలో జరిగే అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యకలాపాలలో వేలాదిమంది భక్తులు తన్మయత్వంతో పాల్గొంటుంటారు.
వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
శ్రీకృష్ణ పరమాత్మను త్రికరణ శుద్ధిగా ఆరాధించి, ఆయన ప్రత్యక్ష కృపను పొందిన మహాభక్తాగ్రేసరులు చాలామంది వున్నా రు. అందరిలోనూ మీరాబాయి అనే భక్తురాలు విశేష ప్రాచుర్యం పొందారు. ఆమె నిత్యం, క్షణక్షణం శ్రీకృష్ణుని ఆరాధనలోనే గడిపి న మహా సాధ్వీమణి. రాజస్థాన్‌లోని ‘కుక్కి’ ప్రాంతానికి చెందిన మీరాబాయి రాజ్‌పుత్ వంశానికి చెందినవారు. ఈమె హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి. గాయకురాలు. సామాజికంగా, కుటుంబ పరంగా నిర్లక్ష్యానికి గురవ్వడం వల్ల శ్రీకృష్ణుని భక్తిపారవశ్యంతో తనను తనే మరచింది. మీరాబాయి. భర్త మరణం తర్వాత అత్త మామల శారీరక, మానసిక హింసను భరించింది. ఆమె రచించిన వేలాది భక్తి కవితలు భజనల రూపంలో భారతదేశం అంతటా విశేష ప్రాచుర్యం పొందాయి. హిందూ దేవాలయంగా పేరొందిన ‘చిత్తోర్‌ఘర్ కోట’ మీరాబాయి జ్ఞాపకార్థం ఆమెకు అంకితం చేయ బడింది. మీరాబాయి తన చివరి రోజుల్లో ద్వారక (బృందావన్) లో నివసించిందని, అక్కడ కృష్ణుడి విగ్రహంలోకి ప్రవేశించడం ద్వారా ఆమె అదృశ్యమైందని పురాణాలు చెబుతున్నాయి.
మీరాబాయి జీవితకథ ఆధారంగా తమిళంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ప్రధాన పాత్రలో 1945 ప్రాంతంలో ఒక చలన చిత్రం రూపొందించబడింది. అలాగే, మీరాబాయి జీవితం ఆధారంగా 1979లో గుల్జార్ ఒక హిందీ సినిమాను నిర్మించాడు. మెర్టాలోని మీరా మహల్ మ్యూజియంలో శిల్పాలు, చిత్రాలతో మీరాబాయి జీవిత కథ చెప్పబడింది. శ్రీకృష్ణుని భక్తితో ఆరాధించినవారిలో మీరాబాయిది అగ్రగణ్యం అయినా, అదే స్థాయిలో శ్రీకృష్ణుని సేవించిన వారిలో ఇంకా చాలామంది భక్తులు వివిధ ప్రాంతాలలో వున్నారు. అదీగాక, శ్రీకృష్ణవ్రతం ఆచ రించిన, ఆచరించే భక్తులు లక్షల సంఖ్యలో వున్నారు. ఈ వ్రతాన్ని శ్రీకృష్ణాష్టమి, ఫాల్గుణ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి వంటి అతి ముఖ్యమైన తిధులలో ఆచ రించటం శ్రేష్ఠం.
మధుర, ద్వారక, పూరి, గురువాయూర్, ఉడిపి, తిరుమల, శ్రీరంగం వంటి ప్రముఖ, ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని ఆచరించుట వలన దివ్య ఫలములు లభిస్తాయి.
ఇక మీరాబాయి తర్వాత అంతే ఖ్యాతిగాంచిన, శ్రీకృష్ణ భగ వానుని కరుణకు పాత్రమైన ‘వల్లభదాసు’ అనే భక్తుడు మధురకు చెందినవాడు. నిత్యమూ శ్రీకృష్ణుని తలుస్తూ, ఆ స్వామియే ఎదురు గా వున్నట్టు పారవశ్యం చెందేవాడు. ప్రతిరోజూ మధురలోని ఆలయానికి వెళ్ళి ఆ స్వామి సేవలో తరించేవాడు. ఒకసారి శ్రీకృష్ణు డు ఈయన గృహానికి కూడా వెళ్ళి పరీక్షించాడు. అంతటి నిస్వార్థ భక్తగణ్యుడు వల్లభదాసు.
అలాగే, ఉడుపికి చెందిన రంగదాసుడు అనే భక్తులు సైతం శ్రీకృష్ణుని కృపకు పాత్రుడయిన భక్తుడే. ఇంకా, కేరళలోని గురువా యూరు శ్రీకృష్ణునికి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని కృష్ణన్ అనే భక్తుడు కూడా శ్రీకృష్ణుని కరుణా కటాక్షాలకు నోచు కున్నవాడే. ముఖ్యమైన కృష్ణ క్షేత్రం కాకపోయినా గోవిందపురం లో మాధవుడు అనే భక్తుడు అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి కావ టం వలన ఆయనకు ఆలయ ప్రవేశం దుర్లభమయ్యేది. అయినా ఆలయం వెలుపల కూర్చుని భగవానుని స్మరిస్తూ మైమరచిపోయే వాడు. ఒకసారి ఆ దేవదేవుని లీలను ఈ భక్తునిపై ప్రసరించిన వైనాన్ని గమనించిన దేవస్థాన పాలక వర్గం మాధవునిని ఆలయ ప్రవేశానికి సగౌరవంగా తోడ్కొని వెళ్ళింది. భగవంతుడు తన భక్తుల గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగనీయడానికి ఈ సంఘ టన ఒక దృష్టాంతం.
తరతమ భేదాలు లేకుండా, వర్గ వైషమ్యాలు లేకుండా ఆ భగ వంతుడు తన కరుణా కటాక్షాలు, తన భక్తులపైన ప్రసరిస్తాడని చెప్పేందుకు ఇంకా అనేక దృష్టాంతాలున్నాయి.
‘ఇస్కాన్’ కేంద్రాలకు భూరి విరాళాలు ఇచ్చే ప్రముఖ దాతలకు కొరత లేదు. పెద్దపెద్ద కొలువులు వదలుకుని ఆ పరమాత్ముని ‘సేవ’కే అంకితమయిన మేధావి వర్గానికి చెందినవారు అనే కులు వున్నారు.
‘శ్రీకృష్ణ’ అనే పదమే ఎంతో మధురం. ఆ పదం వింటేనే తను వంతా పులకరిస్తుంది. ఆ శ్రీకృష్ణ భగవానుని కొలిచే చేతులు, ప్రార్థించే పెదవులు ఎంతో పుణ్యం చేసుకున్నట్టుగా భావించాలి. అం దుకే, శ్రీకృష్ణ భగవానుని భక్తులు మానసికంగా చాలా దృఢమ యినవారు. లేమికి అతీతులు. వారికి కావలసింది ఆ దేవదేవుని యొక్క సేవాభాగ్యం. అందుకే ఈ పద్యం స్మరిస్తూ మనలను మనం ధన్యత గావించుకుందాం.
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్ష:స్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేచ ముక్తానళం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి…
– పంతంగి శ్రీనివాసరావు
9885112517