annamayya slokam ఏమని పొగడుదుమే
రాగం : అభేరి
ప|| ఏమని పొగడుదమే యిక నిను
ఆమని సొబగుల ఆలమేల్మంగ || ఏమని ||
చ|| తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయుగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పొదులివికదవే
పలుమరు పువ్వుల పానుపులు || ఏమని ||
చ|| తియ్యని నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మెలక నవ్వుకదె
నెయ్యపు కప్రపు నెరిబాగాలు || ఏమని ||
చ|| కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరు సిరినగురు
తావుకొన్న మీ తమకములే కదే
కావించిన మీ కల్యాణములు || ఏమని ||