తిరుమల, ప్రభన్యూస్: టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో ముద్రించిన అగ్నిమాపక పురాణం (పధమభాగం), ఉత్తర హరివంశం (ప్రథమ ద్వితీయ సంపుటాలు) ప్రంథాలను టిటిడి చైర్మెన్ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆవిష్కరించారు. ఛైర్మన్ మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మవ్యాప్తిలో భాగంగా ఇతిహాసాలను, పురాణాలను సరళమైన తెలుగులోకి అనువధించి సామాన్య పాఠకులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. అగ్నిమాపక పురాణంలో మొత్తం 383 అధ్యాయాల్లో 11 వేలకు పైగా శ్లోకాలు ఉన్నాయని, ప్రధమ భాగంలో 209 అధ్యాయాల్లో 5,780 శ్లోకాలు ఉన్నాయని తెలిపారు. శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం సంస్కృత విశ్రాంతచార్యులు డాక్టర్ ప్రతాప్ తెలుగులోకి చక్కగా అనువధించారని వివరించారు. అదేవిధంగా నాచన సోమన రచించిన ఉత్తర హరివంశం గ్రంథంలో ఆరు ఆశ్వాసాలు ఉన్నాయని, వీటిని రెండు సంపుటాలుగా శ్రీకృష్ణదేవ రాయ విశ్వవిద్యాలయం తెలుగు విశ్రాంతచార్యులు డా||తుమ్మపూడి కోటేశ్వర రావు తెలుగులోకి అనువధించారని చెప్పారు. ఈ రెండు గ్రంథాలను జన బాహు ళ్యంలోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేసిన పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకా ధికారి డా||ఆకెళ్ళ విభీషణశర్మ, ఇతర పండిత పరిషత్ పెద్దలకు కృతజ్ఞతాభి నందనలు తెలిపారు. టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు పూర్వ ప్రత్యేకాధికారి డా||సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ భగవంతుడు వేదాల్లో చెప్పిన విషయాలను అందరికి అర్దమయ్యేలా విశదీకరించేందుకు 18 పురాణాలను వేద వ్యాసుల వారు రచించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మయ్య, పండిత పరిషత్ సభ్యులు రామసూర్యనారాయణ, సుబ్రమణ్యం, దూళిపాల ప్రభాకర్, సంజీవరావు, సాయిరామ్ సుబ్రమణ్యం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి రామకృష్ణ శాస్త్రి, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆకెళ్ళ విభీషణశర్మ, దరశరథ్, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement