(అక్షయ తృతీయ సందర్భంగా ఈ వ్యాసం)
వైశాఖ శుద్ధ తదియ అత్యంత పవిత్రమైనది. ఇదే అక్షయ తృతీయ. ఇది మహిమాన్వితమైనది. అక్షయం అంటే క్షయం లేనిది. జీవితంలో అన్నిటినీ అక్షయం చేసే పర్వ దినం. ఈ పర్వం ప్రత్యేకతను భవిష్య, శివపురాణాలు శ్లాఘిం చాయి. ఆరణ్యవాస సమయంలో ధర్మరా జుకు శ్రీ కృష్ణుడు ఈ తిథిప్రాశస్త్యాన్ని వివ రించినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉంది.
ప్రతి యుగం ఒక్కో తిథిన ప్రారంభ మైంది. ఆ విధంగా కృతయుగం వైశాఖ శుక్ల తదియనాడు, త్రేతాయుగం కార్తిక శుక్ల నవమి నాడు, ద్వాపర యుగం భాద్రపద బహుళ త్రయోదశి నాడు, కలియుగం మాఘ బహుళ అమావాస్య నాడు ప్రారంభ మయ్యాయని విష్ణు పురాణం చెబుతోంది. దీనిని బట్టి కృతయుగారంభ దినాన్నే అక్షయ తృతీయగా జరుపుకుం టున్నామన్న మాట. ఆ యుగంలో ధర్మదేవత (వృషభం) నాలుగు పాదాలతో దివ్యంగా నడిచింది. జన బాహుళ్యానికి ఏ కొరతా లేకుండా సకల సౌభాగ్యాలు అక్షయంగా అమరడమే అందుకు కార ణం కావచ్చు. అందుకే అక్షయ తృతీయను ఆ నాటి నుంచి నేటి వరకు జరుపుకుంటున్నాం.
ప్రతి పర్వం నాడు ఆచరించవలసిన విధి విధానాలు కొన్ని ఉంటాయి. అక్షయ తృతీయనాడు పాటించ వలసిన విది విధానాలు కూడా మన పూర్వ ఋ షులు తెలిపారు. ఆ రోజున వేకువనే గంగా స్నానం చేయడం మరింత పుణ్యప్ర దమని చెప్పారు. అది వీలు లేకుంటే బావి నీటితో నైనా సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల సంచిత పా పాలన్నీ క్షయమై అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని చెప్పారు. ఈనాడు పితృ కర్మలాచరించడం శ్రేయస్కరం. అందువల్ల పెద్ద్దల ఆశీస్సులు అక్షయంగా లభిస్తాయి.
అక్షయ తృతీయ నాడు ఏ శుభ కార్యం ఆరంభించడానికి వర్జ్యంతో నిమిత్తం లేదని శాస్త్రాలంటున్నాయి. వైశాఖ మాసం ఆరంభంలో ఎండల తీవ్రత కనిపిస్తుంది. అందువల్ల పరమేశ్వర సంకల్పం చెప్పుకుని ఎండ తీవ్రతను తట్ట్టుకోవడానికి వీలుగా ఉదకదానం, విసనకర్ర, పాదుకలు దానం చేయడం శ్రేష్ఠం. చలివేద్రాలను ప్రారంభించవచ్చు. లేదా ఇంతకు ముందు ఉగాదినాడు ఏర్పరచిన వాటికి సహకరించవచ్చు.
పూజలో సువర్ణాన్ని ఉంచి పూజించాలి. ఇందువల్ల లక్ష్మీ కృపతో అనంతంగా అభివృద్ధి జరుగుతుందని శాస్త్రాలంటు న్నాయి. ఈ తిథి నాడు ఒంటిపూట మాత్రమే భుజించాలి. ఉప్పు నిషిద్ధం. చక్కెర కలిపిన పేల పిండిని ఆ హారంగా స్వీకరించాలి. ఇలా శాస్త్త్రం చెప్పినవి ధివిధానాలను పాటిస్తే మనసులో తలచు కున్నశుభకామనలన్నీ తీరుతాయని శాస్త్త్రవచనం.
అక్షయ తృతీయకు ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. ఈ రోజే సిం హాచలంలో కొలువై ఉన్న లక్ష్మీవరా హస్వామి నిజరూప దర్శనం చందనోత్సవం జరుగుతాయి. ఈ రోజు స్వామి నిజరూప దర్శనానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మరొక విశేషమేమంటే పూరీక్షేత్రంలో జగన్నాథుని రథోత్సవం ఆషాఢ శుద్ధ విదియ నాడు జరుగుతుంది. సభద్ర, బలభద్రులతో పాటు జగన్నాథుడు మూడు వేర్వేరు రథాల లో భక్తులను అనుగ్రహించ డానికి ఆలయం నుంచి బయలు దేరుతాడు. ఆ ముగ్గురు మూర్తు లకు విడివిడిగా రథాలు రూపొం దించడానికి ఈ అక్షయ తృతీయ నాడు అంకురార్పణ జరుగుతుంది. ఈ తిథి నాడే బలరాముడు నాగావళి నదిని తవ్వాడని కూడా ఒక కథ ఉంది. వసంత ఋతువులోని చైత్ర మాసాన్ని మధుమాసంగా, వైశాఖ మాసాన్ని మాధవ మాసంగా పేర్కొంటారు. ఇది శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం. మా అంటే శ్రీల క్ష్మి. ఆమెకు ప్రియమైన తిథి తృతీయ. నారాయణునికి ప్రీతికరమైన మాసంలో ల క్ష్మీ దేవికి ఇష్టమైన తిథి ఇది. అలాగే తృతీయ తిథినాడు యావద్భారతదేశంలో మహాల క్ష్మీ ఆరాధన జరుగుతుంది. కొందరు వ్యాపారులు, సంస్థలవారు ఈ రోజు కొత్త పుస్తకాలు ప్రారంభిస్తారు.
ఈ అక్షయ తృతీయనాడు శ్రీమహాలక్ష్మిని ఆరాధించి సకల దోషాలు, పాపాలు క్షయమై అక్షయమైనఅష్టైశ్వర్యాలు చేకూరాలని ప్రార్థిద్దాం.
ఎ. సీతారామారావు
89787 99864