Tuesday, November 26, 2024

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

అమ్మవారిని దర్శించుకున్న అమాత్యులు, ప్రముఖులు
కోటబురుజుపై నుంచి సంబరాన్ని తిలకించిన అశోక గజపతి

విజయనగరం, ప్రభ న్యూస్‌ బ్యూరో: ఉత్తరాం ధ్ర ఇలవేల్పు, విజయనగరం గ్రామ దేవత పైడితల్ల మ్మ జాతరలో కీలక ఘట్టమైన సిరిమాను సంబరం అంబరాన్నంటింది. మంగళవారం సాంప్రదాయబ ద్ధంగా సాగిన ఈ సంబరంలో పాల్గొన్న భక్తజనులు సిరిమానుపై ఆశీనులైన పూజారిలో తమ ఇష్టదేవత అమ్మవారిని చూసుకొని పులకించిపోయారు. మధ్యాహ్నం 3గంటల 42 నిమిషాలకు అమ్మవారి ఆలయ ఆవరణ నుంచి ముందుకు సాగిన సిరిమాను రథం కోట వరకు చేరుకొని అక్కడి నుంచి అమ్మవారి గుడికి ముమ్మారు రాకపోకలు సాగించింది. ఆ ప్రక్రియ ముగిసేసరికి సమయం సాయంత్రం 5 గంటల 6 నిమిషాలైంది. కాగా, కోవిడ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో అనివార్యంగా ఇళ్ల వద్దనుంచే సిరిమాను సంబరాన్ని తిలకించారు. అనేకచోట్ల ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు అధికారులు.
పట్టువస్త్రాలు సమర్పించిన
మంత్రి వెల్లంపల్లి
మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకు న్న వారిలో దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, పురపాలన, పట్టణాభివృ ద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కుటుం బ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న బొత్స ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు కూడా మరోమారు అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకొని సాంప్రదాయబ ద్ధంగా పూజలు పూజ లు జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కోట బురుజుపై నుంచి సిరిమాను సంబరాన్ని తిలకించారు. ఉపముఖ్య మంత్రి పుష్పశ్రీవాణి మంత్రులు బొత్స సత్యనారా యణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌,అవంతి శ్రీనివాసరావు తదితరులతోపాటు డీసీసీబీ ఆవరణ నుంచి సిరిమా నోత్సవాన్ని తిలకిం చారు. మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్‌, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement