ఏకాంతంలో ఉన్నప్పుడు అంతర్ముఖత వస్తుంది. భగవంతునితో గాఢమైన, ప్రశాంత సహవాసము ఆత్మకు ఎంతగానో లాభిస్తుంది. అంతర్ముఖత ఎటువంటి ఉన్నత స్థితిని తీసుకువస్తుందంటే నువ్వు ఆలోచించిన తర్వాత మాట్లాడుతావు. నువ్వుకేవలం మాట్లాడటమే కాక నీ స్వభావాన్ని పక్కన పెట్టి ఇతరులతో ఘర్షణను రానివ్వవు. ఇందుకు ఎటువంటి అభ్యాసము అవసరం లేదు. అవసరమైనప్పుడే మాట్లాడుతావు, నాకు సమయం లేదు అన్న సాకులకు స్వస్తి చెప్పగలుగుతావు. అంతర్ముఖతతో నీ మనసును నీ అదుపులో పెట్టుకోగలవు. నీ బుద్ధిని శుద్ధి చేసుకుని మార్చుకోవలసిన అలవాటును సునాయాసంగా మార్చుకోగలవు. ఆధ్యాత్మికత చెడును వ్రేళ్ళ నుండి పెకిలించి
వేసి నిన్ను పరివర్తన చేస్తుంది.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి