తెలుగు నేలపై కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే గిరి శృంగం మీద వెలసిన పరమ పవిత్ర స్థలంగా భాసిల్లుతున్న క్షేత్రం. పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవది, శ్రీ భ్రమరాంబా దేవికి నెలవైన శక్తిపీఠం. శైవక్షేత్రాల్లో తలమానికం. మల్లికార్జున మహాలింగ చక్ర వర్తి కొలువై ఉండి, సకల లోకారాధ్యంగా, త్రైలోక్య పూజితంగా విరాజిల్లుతున్నది. సంకల్ప, పూ జా సందర్భాలలో శ్రీశైలానికి ఏ దిగ్బాగంలో ఉన్నామో భగవంతునికి తెలియచేసుకునే సాంప్ర దాయాన్ని బట్టి క్షేత్ర ప్రాధాన్యత స్పష్టం అవుతున్నది.
పురాణాల్లో వర్ణితమైన ఎని మిది శృంగాలతో, నలభై నాలుగు నదులు, అరవై కోట్ల తీర్థరాజాలు, పరాశర, భరద్వాజా తపోవన సీమలతో, చంద్ర, సూ ర్యకుండాది పుష్కరిణులతో, లత లు, వృక్ష సంతతులు, అనేక లింగా లు, అద్భుత ఔషధాలు కలిగి శ్రీశై ల మల్లన్న దేవుని సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
పాతాళగంగ నామాంకిత అయిన కృష్ణవేణీ నది ఈ ప్రదేశంలో ఉత్తర వాహనిగా ప్రవహ స్తున్నది. అష్టాదశ పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం వర్ణించబడింది. కృతయు గంలో హరణ్య కశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడు. పురాణాల ప్రకారం సీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు భక్తితో స్థాపించిన సద్యోజాత లింగం, పంచపాండవ లింగాలు పూజార్హత కలిగి అలరారుతున్నాయి.
స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంత తకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంత కాలం ఇక్కడ తపస్సు చేసి, శివానంద లహరిని రచించి, మల్లికార్జునుడికి సమర్పించి, భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార ప రంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహ సరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురు చరిత్ర చెబుతోంది. నృసింహ సరస్వతి స్వామి ఇప్పటికీ కదళీవనంలో గుప్త రూపంలో ఉన్నట్లు దత్తాత్రే య భక్తులు విశ్వసిస్తారు.
శ్రీశైలంలో పంచ మఠాలు ప్రాచీనమైనవి. మొదటిదైన ఘంటామఠం- శ్రీశైల ఆలయానికి వాయువ్య దిశగా ఉంది. శివ సాధకుడైన ఘంటాకర్ణ సిద్దేశ్వరుడు తన శిష్యులతో కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రెండోదైన విభూతి మఠం, శ్రీకృష్ణ దేవరాయల కాలపు వీరశైవుడైన శాంతి మల్ల య్య అనే వ్యక్తి పేరు మీదుగా ఏర్పడినట్లు పరిశోధనలు వివరిస్తున్నాయి. మూడోదైన రుద్రాక్ష మఠాన్ని మల్లి శంకరస్వామి అనే భక్తుడు నిర్మించాడని తెలుస్తోంది. నాలుగోదైన సారంగ మఠా న్ని సారంగేశ్వరముని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దీనికి సంబంధించిన లిఖిత ఆధా రంగా క్రీ.శ.1585 నాటి శాసనం మఠంలో లభ్యమైంది. అయిదోదైన నంది మఠంలో నందికేశ్వరుడు అనే యోగి సుదీర్ఘకాలం జీవించాడు. ఇది ఘంటా మఠానికి వైపు ఉండేది. ఇవేకాకుండా శ్రీశైలం లో పలు మఠాలు ఉండేవి.
ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 11వ తేదీన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా 13న హంస వాహన సేవ జరుగనుం ది. ఈ నెల 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ, అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు. 16న పుష్ప పల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం.. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలం కరణ ఉండనుంది. అర్ధ రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యా ణోత్సవం నిర్వహంచ నున్నారు. 19న సాయంత్రం రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహంచను న్నారు. 20న పూర్ణాహుతి కార్యక్రమం.. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణం. 21న అ శ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనో త్సవం, ఏకాంతసేవతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
అంగరంగ వైభవం…శ్రీశైల మల్లన్న క్షేత్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement