Sunday, September 22, 2024

‘సేవే’ దైవస‘న్నిధి’

(సత్యసాయి ఆరాధనోత్సవం సందర్భంగా ఈ వ్యాసం)

సకల దేవతా స్వరూపులు భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్త్తాత్రేయుని అంశతో భరద్వాజ ఋషి గోత్రంలో షిరిడిసాయి అవతార పరంపరలో భాగంగా జన్మించారు. ఈ విషయాన్ని స్వామితో ప్రత్యక్షానుభవం కలిగిన ఎందరో మేధావులు తమ రచనల ద్వారా తెలియజేశారు. భగవాన్‌ బాల్యం నుంచి ఎన్నో మహిమల్ని చూపి, మరెన్నో ఆద్భుతాలను ఆవిష్కరించి భక్తులు తన సన్నిధికి వచ్చే విధంగా చేశారు. అయితే మహిమల ద్వారా, అద్భుతాల ద్వారా సమాజంలోని మానవుల కష్ట నష్టాలను రూపుమాపగలిగిన దేవుడు సేవామార్గం వైపు మనుషులను ఎందుకు మరలింపజేశాడు? అని ప్రశ్నించే పరిస్థితి నెలకొని ఉంది. మనిషిి ధర్మమార్గాన్ని వీడి అధర్మవర్తనుడై సంచరిస్తున్న వేళ అతనిని సన్మార్గం వైపు మరలించడానికి ఒక గురువు కావాలి. దైవం మనిషిి రూపంలో భూమిపై అవతరించి అద్భుతాలను ఆవిష్కరించి ఈ మానవ జాతిని తన వైపు ఆకర్షిం పజేసుకుని వారిలో పతనమైపోతున్న మానవతా విలువలను ఉద్ధరించి, సన్మార్గంలో ప యనించే విధంగా తీర్చిదిద్దు తాడు. భగ వంతుడు తాను చేయవలసిన సమా జోద్ధరణను మానవుల చేత చేయించి తన ఉనికిని చాటుకుంటాడు. మానవ జన్మకు సార్థకతను, పవిత్రతను సంతరింపజేసేం దుకు భగవంతుడు నిర్వర్తించిన ధర్మమే సేవామార్గం! ఈ ధర్మాన్ని బోధించేందుకే భగవాన్‌ సత్యసాయిబాబా అవతరించారు. దేశ విదేశాలలోని లక్షలాది మందిని తన దివ్యత్వం వైపు ఆకర్షింప జేసుకుని, సేవా పరాయణులుగా తీర్చిదిద్దారు. ఈనాడు అంతర్జా తీయ స్థాయిలో సేవలందిస్తున్న ”సత్యసాయి సేవాదళ్‌ ‘ భగవాన్‌ అద్భుత సృష్టి అనటంలో ఎటుంటి సందేహం లేదు. స్వామిని దైవంగా, గురువుగా భావించే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, అన్నా ర్తులకు, బహుముఖ సేవలు అందిస్తున్నా రు. ఈనాడు స్వామి భౌతికంగా మన కళ్లెదుట లేకపోయినా నిరంతర స్వామి స్మరణతో ఆత్మను పరిపుష్టం చేసుకుని, ఎన్ని చికాకులెదురైనా స్వామి చెప్పిన ప్రేమ తత్త్వాన్ని ఆత్మకు అనుసంధానం చేసుకుని సేవే దైవంగా భావించి, సేవా మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ”దైవాన్ని లేదా గురువును ఆదర్శంగా తీనుకుని జీవన పయనాన్ని ప్రారంభిస్తే అంతరాత్మ నిరంతరమూ మంచి మార్గాన్ని సూచిస్తూనే ఉంటుంది” అని స్వామి పలు మార్లు తమ దివ్యోపన్యాసాలలో తెలియజేశారు. భగవాన్‌ సత్యసాయి తన భక్తులను సేవా మార్గంలో పయనింపజేసేందుకు ముందు వారి అంతరంగంలో గూడుకట్ట్టుకుని ఉన్న దుర్భావములను రూపుమాపేవారు. ఆయన ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా నెమరు వేసుకుందాం. ”మానవుణ్ణి ఏ దుష్ట శక్తులో అంటిపె ట్టుకుని బాధించ వు. అరిషడ్వర్గాలనే భూతాలు మీ అంతరంగాలలో తిష్ఠ వేశాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఈ దుష్ట శక్తులే మీ ధర్మాన్ని మీరు నిర్వహించకుండా అడ్డుపడుతూ మిమ్మల్ని పెడమార్గంలో నడిపిస్తున్నాయి. స్వామి ఉపదేశించే ప్రేమ తత్త్వాన్ని మీ మనసులలో నింపుకుని ప్రతి మనిసిని, చివరకు మీ శత్రువును సైతం ప్రేమించగలిగిన నాడు మీ అంతరంగాన్ని పట్టి పీడించే ఈ ఆరు దయ్యాలు పలాయనం చిత్తగిస్తాయి. అప్పుడే మనిషిి పవిత్రాత్ముడవుతాడు. ప్రతి మనిషి ఆత్మతత్త్వాన్ని అవగతం చేసుకున్న వేళ సాటి మనిషిని ప్రేమించడం మొదలుపెడతాడు. ఆధ్యాత్మికమైన ఆలోచనలతో జీవన గమ్యాన్ని చేరుకోవాలని అభిలషిస్తాడు. జీవన పోరాటంలో ముగింపు ఎప్పుడు? అని మనిషిి ఆలోచించడం ప్రారంభించిన వేళ అతని జీవన గమ్యం సుదూర తీరంలో కనిపించినట్లుగానే భావించాలి. ఆస్తులు సంపాదించి బిడ్డలకు సంక్రమింపజేపినప్పుడు కాదు స్వామి ప్రవచించిన ప్రేమత త్త్వాన్ని ఆచరణాత్మకం చేసినప్పుడు మాత్రమే అతను గమ్యం చేరినట్లు” ఈ భావనను సత్యసాయి తమ భక్త జనావళిలో నిక్షిప్తం చేశారు.
”ప్రేమే దైవం, నా దగ్గరున్న ఆయుధం ప్రేమ, నా దగ్గరున్న అద్భుతం ప్రేమ, సకల మానవాళిని ప్రేమతో ఆదరించిననాడే నీ జీవన అధ్యాయం సంతృప్తిగా ముగిసినట్లు. నీ హృదయాన్ని విశాలం చేసుకుని సృష్టిలోని సకల జీవ రాశిని నిండు మనసుతో ప్రేమించు అదే నన్ను చేరుతుంది. నీ జీవితానికి సార్ధకత చేకూరుతుంది” అని భగవాన్‌ భక్తులకు మార్గ నిర్దేశనం చేశారు.
ప్రేమ తత్త్వ్తంలోనే సేవా గుణం దాగి ఉందని స్వామి చెప్పకనే చెప్పారు. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్న సాటి మానవులను ప్రేమతో చేరదీసి వారికి సాయం చేయడం ద్వారా స్వామి చెప్పే ప్రేమ తత్త్త్వంలోని సేవాతత్పరత వెల్లడవుతుంది. స్వామి మార్గంలో ప్రయాణిస్త్తున్న సత్యసాయి సేవాదళ్‌ ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా విభిన్న రంగాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గిరిజన ప్రాంతాలలో తాగునీటి సౌకర్యం, లాభార్జన లేకుండా వి ద్యా సౌకర్యాల కల్పన, ఆస్పత్రులు లేని కొండ ప్రాంతాలలో వైద్య సౌకర్యాలు, పుట్టపర్తిలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో లభించే ఉన్నత వైద్య సౌకర్యాలు అన్నీ భగవాన్‌ సత్యసాయి బాబావారి ప్రేమ తత్త్వానికి ప్రతీకలు! స్వామి ప్రే మ తత్త్వాన్ని ఆచరణాత్మకం చేస్తున్న సాయిసేవకుల సేవాతత్పరతకు నిలువెత్తు నిదర్శనాలు.
జీవితం ఒక ఆట! పుట్ట్టినది మొదలు గిట్టే వరకూ ఆ ఆటలో విభిన్న పార్శ్వాలను ఎదుర్కోవాలి మానవుడు. కష్టాలు, వేదనలు, మేఘాల మాదిరి కమ్ముకుంటాయి. కాని స్వామి ఆనుగ్రహం అనే చల్ల్లని గాలి వీచిన వేళ ఆ మేఘాలు చెల్లాచెదరై నిర్మలాకాశం కనువిందు చేసినట్లు మన జీవన మార్గంలోని ముళ్లు, రాళ్లు లాంటి కష్టాలు, ఈతిబాధలు పటాపంచలైపోతాయి. అందువలన ఎలాంటి వి పత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ స్వామి ప్రేమ తత్త్త్వా న్ని ఆచరణలో పెడుతూ సేవా మార్గంలో పయనించి విలువైన గమ్యాన్ని చేరుకుని నీ నిజతత్త్వాన్ని నీవు తెలుసుకోగలిగితే జీవన పోరాటంలో విజయాన్ని సాధించగలవు. ఈ జీవన నాటకంలో మహోన్నతమైన ముగింపు ను ఆస్వాదించగలవు.

విడదల సాంబశివరావు
98664 00059

Advertisement

తాజా వార్తలు

Advertisement