Wednesday, October 2, 2024

శ్రీ ప్లవనామ సంవత్సర సింహ రాశి ఫలాలు

సింహ రాశి
ఆదాయం-2, వ్యయం-14
రాజ పూజ్యం- 02, అవమానం-02

ఈ సం|| గురుడు ఉగాది 13.4.2021 నుండి 14.9.2021 వరకు మరల 20.11.2021 వత్సరాం తం వరకు కుంభరాశిలో 7వ స్థానంలో శుభుడైనం దున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందు తారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. కుటు-ంబ సౌఖ్యము, ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. 15.9.2021 నుండి 19.11.2021 వరకు మకరరా శిలో 6వ స్థానమై సాధారణ శుభుడైనందున ముఖ్య మైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటు-ంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహిం చుట మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం వుంది.

ఈ సం|| శని ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు మకరరాశిలో 6వ స్థానంలో శుభుడైనందున బంధు మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలా భంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటు-ంబ సౌఖ్యముంటు-ంది. వ్యాపారస్తులు తమ వృత్తియందు అధిక లాభములు గడిస్తారు.

ఈ సం|| రాహువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృషభరాశిలో 10వ స్థానమై సాధారణ శుభుడైనందున మానసికానందం లభిస్తుం ది. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

ఈ సం|| కేతువు ఉగాది 13.4.2021 నుండి వత్సరాంతం వరకు వృశ్చికరాశిలో 4వ స్థానంలో అశుభుడైనందున కుటు-ంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యా లు ఆలస్యంగా నెరవేరతాయి.

కావున పూర్వార్ధమున గురు, శని, కేతువులకు జప, దానములు ఆపదుద్ధారక స్తోత్రము, కనకధారా స్తోత్రము చేయుట, మఖ వారు వైడూర్యము, పుబ్బవారు వజ్రమును, ఉత్తర వారు కెంపు ధరించిన కొంత మేలు కలుగును.

– శ్రీ గుదిమెళ్ళయతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement