Monday, November 11, 2024

భగవంతుని మొదటి నామం ‘నేను’

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది ‘మౌనం’ లేదా ‘మౌనముద్ర’. ఆయన చాలాతక్కువగా ప్రసంగించే వారు. తనమౌనంతో సందేశం పొందలేనివారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు, ఆయన బోధన లలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానంప్రధానాంశంగా వుండేది. ఎవరైనా ఉపదేశించమని కోరితే, స్వీయ శోధన ఉత్తమ మని, ఇది సూటిమార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్య మని బోధించేవారు. అలాగే ‘నేను’ అనే దాని గురించి రమణలు చెప్పిన ఆణిముత్యాలివి.
”నేను” ఒక మహామం త్రం. ఇది ఓంకారంకన్నా శక్తి వంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం.
హృదయమే శక్తి కేంద్రం. హృదయం నుండి సహస్రారా నికి అమ్రత నాడి ఉంది. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటు-ంది. జ్ఞానిలో తెరుచుకుని ఉంటు-ంది. ఇది తెరుచుకోవ డమే జ్ఞానం. ఇది తెరుచుకోవడమే మోక్షం.
ధ్యానం అంటే ఏమిటి? మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి అలోచనల దృష్టి మరల్చి ఒక్క ఆలోచనపైనే దృష్టి పెట్టడమే ధ్యానం. ఇలా అభ్యాసం చేయగా చేయగా మన స్సుకు శక్తి కలుగుతుంది. రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏమంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి. అంటే ధ్యానించేవాడు. ఎవరికి వారే ”నేను” కనుక ఆ”నేను”ను, ఆ నేను ఎక్కడుందో ఆమూలాన్ని పట్టు-కోవాలి.
”నేనెవరు” అనే విచారణతో మనస్సు అణుగు తుంది. ఈ ”నేను” అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనలన్నింటిని అణగదొక్కి చివరకు మనసే తన ఉనికినికూడా కోల్పోయి అణిగిపోతుంది.”నేను” అనే ఆలో చన అన్ని ఆలోచనలను నశింపచేసి, తాను నశిస్తుంది.
”నిజమైన నేను” ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ”మాయా నేను” నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచ)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగ కూడ నీరే, నీరులో భాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగ రంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉంది.
ఆత్మజ్ఞాన అన్వేషికి ”నేను”ను విచారించుటే సూటైన మార్గం. అన్నింటికి కారణమైన ”నేను”ను విచారించకుం డా మనసు, బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాభం లేదు. ”నేను” పోయిందా, ”నేను”ను ఆధారం చేసుకుని బతుకుతున్న ఇవన్ని ఎగిరిపోతాయి.
”నేను” అనే ఆలోచన పుట్టిన తరువాతే, క్షణం,
క్షణం మారే వేలకొద్ది ఆలోచనలు పుడుతున్నాయి. ఇన్ని ఆలో చనలకు మూలమైన ఈ”నేనెవరు”ను నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన ”నేను” అనుభవమవుతుంది.
నిద్రపోయే ముందు, నిద్రనుండి మేల్కొన్న వెంటనే ”నేనెవరు”ను ప్రశ్నించుకోవాలి. ఈ రెండు సమయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క తృటికాలం పాటు- ఉంటు-ంది. ఇవి ధ్యానానికి ఉత్తమ సమయాలు. మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement