మనిషి మనసులో బయలుదేరే సంకల్ప వికల్పాలు కూడా ఉత్సాహ ఉల్లాసాలను తక్కువ చేస్తాయి. అతనిని సోమరిగా చేసి నిరాశాభావాన్ని అంటీముట్టనట్లుగా కూర్చొనే భావాన్ని కలిగిస్తాయి. అపుడే పురుషార్థం చేయాలి అని ఆలోచిస్తాడు. ఇలాంటి స్థితిలో కొన్ని ఉపాయాలను అవలంభించాలి.
లేస్తున్నా కూర్చున్నా ప్రపంచంలో ఎవరినైతే అందరూ స్మృతిస్తున్నారో అతనితో నాకు పితాపుత్రుల సంబంధం ప్రాక్టికల్ గా వుంది. ఇపుడు నేను ఆ పరమోత్తముడైన తండ్రి బిడ్డనయ్యాను అని తలంచుకొనాలి. అపుడు బుద్ధి పైకి వెళ్ళుతుంది. దేహాభిమానానికి అతీతమై సాంసారిక విషయాల్లో తగుల్కొనదు. పరమాత్ముని ఒక్క క్షణ కాల దర్శనం కోసం సాక్షాత్కారాల కోసం భక్తులు తలద్రెంచి పెట్టుటకు తయారవుతారు. ఆయన మనకు సహజంగా పరమపిత రూపంలో లభించుట అంటే మామూలు మాటలా? కోట్లమంది పరమాత్మను కొలుస్తుంటారు. కానీ గుర్తించలేరు. ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు కూడా యదార్థంగా తెలుసుకొనలేరు, గుర్తించలేరు. ఇపుడు నేనెంత భాగ్యశాలిని ”నాకు డైరక్టుగా పరమపిత తో సంబంధం కలిగింది” అనుకొనాలి.
బ్రహ్మాకుమారీస్..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి