Monday, October 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 9
9.
శ్రోత్రం చక్షు: స్పర్శనం చ
రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం
విషయానుపసేవతే ||

తాత్పర్యము : ఈ విధముగా జీవుడు వేరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడియున్న ఒకానొకరకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందును. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకమగు ఇంద్రియార్థములను అనుభవించును.

భాష్యము : నీరు స్వచ్ఛతను కలిగి ఉంటుంది. అయితే ఏదైనా రంగును ఆ నీటితో కలిపినట్లయితే దాని రంగు మారిపోతుంది. అలాగే ఆత్మ స్వతహాగా స్వచ్ఛమైనది. కానీ భౌతిక భావనలు, కోరికలు వలన జీవుని చైతన్యము కలుషితమవుతుంది. అది జన్మ జన్మలకు కొనసాగుతూ ఉంటుంది. జీవుని స్వచ్ఛమైన చైతన్యము కృష్ణ చైతన్యము. దానిని పెంపొందిచుకున్నట్లయితే అతడు శుద్ధ స్థితిలో ఉన్నట్లు. అట్లు కాకుంటే కలుషిత చైతన్యమువలన కేవలముమానవ శరీరమే కాక 84 లక్షల జీవరాశులలో ఎటువంటి శరీరమునైనా పొందే అవకాశము ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement