Devotional | శ్రీశైలంలో 27 నుంచి 31 వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు

నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ….. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాల కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకన అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

వివిధ శాఖాధిపతుల కార్యనిర్వాహణ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంతో పాటు పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా సోలాపూర్, సాంగ్లీ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఉత్సవాలకు భక్తులు వస్తున్నారని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

క్షేత్రానికి విచ్చేసే భక్తులందరితో అధికారులు మర్యాదగా మెలగాలని ప్రతి భక్తుడిని ఒక అతిథిగా భావించాలని సూచించారు. ఉగాది ఉత్సవాలు ఈనెల 27వ తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ వారం రోజుల ముందుగానే భక్తులు క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందని అందుకే ఈనెల 20వ తేదీ కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత విభాగల అధికారుల ను ఆదేశించారు.

కాలిబాట నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక శ్రద్ధ కనబడుచాలని సూచించారు. ఉత్సవాలకు కాలిబాట మార్గంలో వెంకటాపురం నాగలూటి దామెర్లకుంట పెద్ద చెరువు మఠం భావి భీమునికులను కైలాస ద్వారం మీదుగా క్షేత్రానికి వస్తారని కాలిబాట మార్గంలో తగిన సదుపాయాలను కల్పించాలని అటవీశాఖ అధికారులను సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మహా శివరాత్రి సందర్భంగా వేయబడ్డ మంచినీటి కులాయిలన్నింటినీ ఉగాది ఉత్సవాలలో కూడా వినియోగించుకో అనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లక్షలాది సంఖ్యలో వస్తున్న భక్తులకు దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు ఔషధాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

గుండె జబ్బులు మొదలైన వాటికి అత్యవసరమైన మందులు కాలి నడిపిన వచ్చే భక్తులకు బొబ్బల నుండి ఉపశమనం కల్పించేందుకు పూత మందులు ఆయింట్మెంట్ వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నివారణ నిర్వహణకు గాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చేపట్టినట్టుగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను వ్యక్తులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

క్షేత్ర పరిధిలో పలుచోట్ల శాశ్వతమరుగుదొడ్లను భక్తులకు వినియోగించుకునేందుకు వీలుగా వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. వాటికి అవసరమైన నీటిని కూడా సమకూర్చాలని సూచించారు. ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

కన్నడ భక్తి సంగీత విభాగ దగ్గరికి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు కన్నడ భక్తి నాటకాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రజా సంబంధాల అధికారి వారిని కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో భక్తుల కాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కార్యనిర్వాణా అధికారి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *