కదిరి – శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి,ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Devotional | ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు – పట్టువస్త్రాలు సమర్పించిన నారా లోకేష్
