భద్రాచలం, : భద్రాచలంలో నేడు వసంతపక్ష ప్రయుక్త నవహ్నిక శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఏప్రి ల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుఢాదివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు, 6న నవమి రోజున తిరుకల్యాణం, పునర్వసు దీక్ష ప్రారం భం కానుంది.ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 12న చక్రతీర్థం, శ్రీపుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది.