Devotional | భక్తజనంతో కిక్కిరిసిన భీమన్న ఆలయం

Devotional | వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రానికి ఆది వారం భక్తజనం పోటెత్తుతున్నారు. వరంగల్ జిల్లాలోని సమ్మక్క సారలక్క జాతరకు సమీస్తున్న వేల వేములవాడ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు.
స్వామివారి దర్శనం కోసం సుమారు ఐదు గంటల పాటు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు . సోమ వారం స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకోగా 30 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఇంచార్జ్ ఈవో రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు.
