Devotional | మహానందిశ్వరుని సన్నిధిలో..

Devotional | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఉన్న మహానందీస్వరిని సన్నిధిలో ఫారెస్ట్ కన్జర్వేటర్ విజయకుమార్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీ మహానందీశ్వర శ్రీ కామేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారి శశిధర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టారు. అభిషేక మండపంలో వేద పండితులు రవిశంకర్ అవధాని వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల రేంజర్ నాజీర్ జా, చలమరేంజర్ ఉదయ్ దీప్, మహానంది, డిఆర్ఓ హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Devotional

Leave a Reply