Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి…
- ఒక్కరోజులో 26 వేల మందికి అమ్మవారి దర్శనం
- 26,002 మంది భక్తులు కనకదుర్గమ్మ దర్శనం
- 27,837 ప్రసాదం విక్రయం
- రూ.2.05 లక్షల హుండీ/విరాళాల ఆదాయం
- 234 సేవల్లో పాల్గొన్న భక్తులు
- 568 మంది తలనీలాలు సమర్పణ
- అన్నదానంలో 6,815 మంది భక్తులు
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మంగళవారం అమ్మవారిని 26,002 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, దర్శన మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
మంగళవారం ఆలయ వివరాలు..
ఆలయ రోజువారీ గణాంకాల ప్రకారం 27,837 యూనిట్ల ప్రసాదం భక్తులకు అందించారు. దేవస్థానానికి రూ.2,05,463 విరాళాల ఆదాయం సమకూరింది. వివిధ సేవల్లో 234 మంది భక్తులు పాల్గొనగా, 568 మంది తలనీలాలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో 6,815 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
