Indrakeeladri | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..

ప్రశాంతంగా అమ్మవారి దర్శనం
విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మంగళవారం ఆలయ వివరాలు..

సెప్టెంబరు 1 మంగళవారం రోజు న మొత్తం 32,120 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 4,213 దర్శన టికెట్లు జారీ చేశారు. 30,397 ప్రసాదాల యూనిట్లు పంపిణీ చేశారు. ఆలయానికి విరాళాల రూపంలో రూ.2,10,355 ఆదాయం సమకూరింది. 377 సేవలు, 715 మంది తలనీలాలు సమర్పించగా, 776 మంది భక్తులు అన్నదానాన్ని స్వీకరించారు.