11 నుంచి దేవీ నవరాత్రుల మహోత్సవాలు

ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని ఉమాచంద్రశేఖర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు దేవీనవరాత్రుల మహోత్సవాలు నిర్వహించనున్న‌ట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోలగట్ల నరేష్ రెడ్డి, ఆలయ అర్చకులు విస్సావజ్ఞుల నరేష్ శర్మలు తెలిపారు.

మంగపేట మండల కేంద్రంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి దేవస్థానం ఆలయంలో నిర్వహించే దేవి నవరాత్రుల మహోత్సవాలకు సంబందించిన కరపత్రాలను ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీకి చెందిన కొమరగిరి కేశవరావు, కొమరగిరి సామ్రాజ్యం, చాద మల్లయ్య, కల్లెబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.