Development | కత్తెర గుర్తుకు ఓటేస్తే.. కష్టాలు తీరుస్తా..
Development | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటేసి ఆశీర్వ దించాలని.. మాలోత్ బాలు నాయక్ అన్నారు. ఈ రోజు మండలంలోని వంతడపల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ బాలు నాయక్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తు కేటాయించడంతో కటింగ్ షాపులో ఓటర్లకు కటింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదరిస్తే అభివృద్ధి(Development) చేస్తానని.. ఎన్నికల్లో(elections) తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుంభం సువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

