development | గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..

development | గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..

development | తంగళ్ళపల్లి, ఆంధ్ర ప్రభ : తంగళ్ళపల్లి మండలం గండి లచ్చిపేట పంచాయతీ ఎన్నికల్లో గ్రామపంచాయతీ పాలకవర్గం(ruling class) ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఎన్నికైన గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజ బింకర్ రాజన్నలు గజమాల, పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా జంగిటి అంజయ్య మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా(unanimously) సర్పంచ్ పదవిని కట్టబెట్టిన గ్రామ ప్రజలకు, పెద్దలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, సేవ చేస్తానని అన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్న గండి లచ్చపేట గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపి, గ్రామ అభివృద్ధికి(development of the village) తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు.

గండి లచ్చ పేట గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం సర్పంచ్ జంగటి అంజయ్య, ఉప సర్పంచ్ పుట్ట భాను, బల్లెపు ప్రశాంత్, పుట్ట దేవరాజు, బామ్మ గారి వజ్రమ్మ, కుక్కల ఉమా, చదల సుమన్, బిపేట రేణుక, ఆనరాశి జలంధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Leave a Reply