స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం అభివృద్ధి

స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం అభివృద్ధి
కోటి రూపాయల నిధులతో వినియోగంలోకి తీసుకువస్తాం
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని కోటి రూపాయల నిధులతో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. గురువారం జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు గ్రామంలో నిలిచిపోయిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని అధికారులు, స్థానికుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ నైపుణ్య అభివృద్ధి కేంద్రానిర్మానానికి ఎంపీ శివనాథ్ చిన్ని నాయకత్వంలోని కేసునేని ఫౌండేషన్ ఎన్ ఐ ఆర్ డి సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
ఈ భవనాన్ని మహిళల సాధికార శాఖ అయినదంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంజరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా స్థానిక మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా ముందుకు వెళుతున్నట్లు వివరించారు. ఈ కేంద్రంలో డోక్రా మహిళలు పచ్చళ్ళు తయారీ పోషకాహార ఉత్పత్తుల తయారీ లాంటి అంశాల్లో శిక్షణ అందించి వారి కి అండగా ఉండేందుకు ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అన్నారు.
కామన్ ఫెసిలిటీ సెంటర్ గా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ సి ఎస్ సొసైటీ చైర్మన్ ధూళిపాళ్ల లక్ష్మణరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, రావూరి శ్రీనివాసరావు, ముత్తినేని అశోక్, గుమ్మ వెంకటేష్, పంచాయతీరాజ్ ఎస్ ఈ, ఏ ఈ, ఎంపీడీవో, సి వి ఏ పి యు టీం సభ్యులు, అధికారులు స్థానికులు పాల్గొన్నారు.
