దేవినేని కుటుంబం అంటే జిల్లాలో ఒక బ్రాండ్

దేవినేని కుటుంబం అంటే జిల్లాలో ఒక బ్రాండ్
విజయవాడ తూర్పు ప్రతినిధి, ఆంధ్ర ప్రభ : రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృధి శూన్యం తప్ప పేదల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని,ఎన్టీఆర్ జిల్లా లో భూ దందా, ఇసుక, మైనింగ్, పేకాట దోపిడీ,అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని కనుసన్నల్లో జరుగుతున్నాయి అని వైసిపి రాష్ట ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ కావాటి దామోదర్ ఆరోపించారు. బుధ వారం ఎన్టీఆర్ వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దామోదర్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ఎన్టీఆర్ జిల్లా లో అభివృధి శూన్యం. చేసిన అభివృద్ధి చెప్పుకోలేక కేశినేని చిన్ని తన తోక నాయకుల తో దేవినేని అవినాష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణ జిల్లాలో దేవినేని కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఉంది, అలాంటి వ్యక్తి పై అవాక్కులు,చవాకుల పేలితే చిన్ని తోక నాయకులకు తాటతీస్తాం అని వైసీపీ నేతలు హెచ్చరించారు.తూర్పు నియోజకవర్గం లో దేవినేని అవినాష్ చేసిన అభివృధి పై చర్చకు సిద్ధమా… చిన్ని తోక నాయకులకు సవాలు విసిరారు. గతం లో దేవినేని అవినాష్ కి వెన్నంటే గురునాధం ఇప్పుడు కూటమి లో చేరి అవినాష్ గురించి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నావు రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్పుతామని హెచ్చరించారు.
టీడీపీ లో నువ్వు ఒక బానిస నాయకుడువు గుణదల దేవినేని కాంపౌండ్ అంటే ఏంతో మందికి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు పడ్డాయి ఆ పునాదులు లో నివు ఒకడివి ఆది గుర్తుకు చెచ్చుకోవాలని సూచించారు. ఎస్టీ ముసుగులో నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో బహిర్గతం చేయాలా.. నీ అరాచకాలు పై చర్చకు సిద్ధమా.. అని అన్నారు.దేవినేని అవినాష్ పై మాట్లాడటానికి నీ స్థాయి తెలుసుకో మరల దేవినేని అవినాష్ అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు..జిల్లా మహిళ వైస్ ప్రెసిడెంట్ ఇందుపల్లి సుభాషిణి మాట్లాడుతూ మాది గాని గురునాధం అంటే కేశినేని శివనాథ్ కి ఒక బానిస వ్యక్తి అని ఆరోపించారు.
నీ కొడుకు డ్రగ్స్ కేసులో ఉన్నాడు. ముందు ఆ కేసుల గురించి చూసుకో హితవు పలికారు.ఎంపీ అంటే మట్టి దోచుకోవడం, పేకాట ఆడించటం ,ఇదే కేశినేని చిన్నీ నిర్వాకం వ్యక్తం చేశారు. గతంలో మూడు రాజధానుల పేరిట దోచుకున్నది…నువ్వు కాదా… నీ గురించి మాకు తెలియదా..? నివు దేవినేని కుటుంబాల గురించి మాట్లాడే స్థాయా నీదా…?ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీకి దూకె వ్యక్తి వి …గోడ దూకే పిల్లి లాంటి వ్యక్తి నివు … దేవినేని అవినాష్ గురించి మాట్లాడుతూ హక్కు నీకు లేదని ఆమె అన్నారు.
