తిరువూరు అభివృద్ధి పనులపై సమీక్ష..

తిరువూరు అభివృద్ధి పనులపై సమీక్ష..
సీఎంతో జరగనున్న సమావేశానికి ముందస్తు చర్చలు..
కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భేటీ..
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల వేగవంతంపై దృష్టి సారిస్తూ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలెక్టర్ లక్ష్మిశాతో సమావేశమై సమగ్రంగా చర్చించారు. త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో నిర్వహించనున్న ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష సమావేశానికి ముందు భాగంగా ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రజా అవసరాలపై ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. అలాగే, ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్య పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు కోరారు. జిల్లా అభివృద్ధి దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.
