Development | అమ్మవారికి ప్రత్యేక పూజలు…

Development | అమ్మవారికి ప్రత్యేక పూజలు…
- అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్..
Development | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ కు ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ తో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీసారు.
భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
