Development | రూ. 6 కోట్లతో కుర్చపల్లిని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Development | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుర్చపల్లిలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న వట్టపెల్లి రమాదేవిని గెలిపిస్తే రానున్న మూడేళ్ల లో రూ.6కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.ఇప్పటికే గ్రామంలో రూ.4కోట్ల తో పలు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.
రూ.2కోట్ల 26లక్షలతో సబ్ స్టేషన్ నిర్మాణం, రూ.20లక్షల తో హెల్త్ సబ్ సెంటర్, రూ.50లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్నట్లు వివరించారు. రెండో విడతలో మరో 50 ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఇస్తానని, కుర్చపల్లి నుండి గోవర్ధనగిరి, విశ్వనాథపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. వానాకాలం లోపు కుర్చపల్లి గ్రామానికి గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
సర్పంచ్ ఎన్నికల తర్వాత మరో రూ.50లక్షలతో సీసీ రోడ్లు మంజూరు ఇస్తానని చెప్పారు. ఇవన్ని జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వట్టిపెల్లి రమాదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మండల నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
పిట్టల శ్రవణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి : కడియం
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పిట్టల శ్రవణ్ కు మద్దతుగా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిట్టల శ్రవణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గండి రామరామం కుడి కాలువ పనులు పూర్తి చేసి గోవర్ధనగిరి గ్రామంలోని కుంటలు నింపడంతో పాటు రెండు పంటలకు సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.
ఏ పని కావాలన్నా ప్రభుత్వం ద్వారా, ఎమ్మెల్యే ద్వారానే కావాలని కావున గ్రామంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పిట్టల శ్రవణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రూ.13 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హల్లు నిర్మాణం చేసుకున్నామని అన్నారు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని అన్నారు.

