చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా దేవర సమత వెంకట్ రెడ్డి

చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా దేవర సమత వెంకట్ రెడ్డి

ఏకగ్రీవంగా ఎన్నిక


చేవెళ్ల, ఫిబ్రవరి 16(ఆంధ్రప్రభ): చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా దేవర సమత వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ టిపిసిసి కార్యదర్శి విప్ జారీ చేసి ఎన్నిక నిర్వాహణాధికారికి క్రితం రోజు అందించడం జరిగింది. ఉదయం 10:00 గంటలకు కాంగ్రెస్ కౌన్సిలర్ సభ్యులంతా సమావేశం హాలుకు చేరుకోవడం జరిగింది. మొదట సభ్యులంతా కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రారంభమయ్యింది. చైర్ పర్సన్ గా దేవర సమతా వెంకటరెడ్డి పేరును బండారు శైలజా ఆగిరెడ్డి(15 వ వార్డు) ప్రతిపాదించగా, మద్దెల శ్రీనివాస్(14వ వార్డు) బలపరిచారు. అదేవిధంగా కాసుల రాములు గౌడ్ పేరును దవల్ గారి గోపాల్ రెడ్డి(8వ వార్డు) ప్రతిపాదించగా, ఫైండ్ల మధుసూదన్ రెడ్డి(11 వ వార్డు) బలపరిచారు. దీంతో చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా దేవర సమతా వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గా కాసుల రాములు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికైన చైర్ పర్సన్ సమతా వెంకటరెడ్డికి, వైస్ చైర్మన్ కాసుల రాములు గౌడ్ లకు సంబంధిత ధ్రువపత్రాలను ప్రిసైడింగ్ అధికారి అందించారు. అనంతరం చైర్ పర్సన్ సమతా వెంకటరెడ్డిని, వైస్ చైర్మన్ రాములు గౌడ్లను చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మొయినాబాద్ మాజీ జడ్పిటిసి కాలె శ్రీకాంత్ లు పూల బొకేలు, శాలువాలతో సన్మానించారు.

Leave a Reply