TG | ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ ఈఈ..
TG | ఆంధ్రప్రభ, వబ్ డెస్క్ : రూ.10వేల లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ముషీరాబాద్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ సెల్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయిరామ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదుదారుడికి సంబంధించిన మొదటి కాంట్రాక్ట్ పనికి ఇప్పటికే జారీ చేసిన నాణ్యత నియంత్రణ ధ్రువీకరణ పత్రం విషయంలో అధికారిక సహాయం చేయడంతో పాటు, రెండో కాంట్రాక్ట్ పనికి కూడా నాణ్యత నియంత్రణ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు సాయిరామ్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు.
ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా నగర పరిధి-1 ఏసీబీ అధికారులు సాయిరామ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. అనంతరం నిందితుడిని నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినా, స్వీకరించినా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
