Deputy CM | పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా…

Deputy CM | పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా…

Deputy CM |వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి పర్యటన వాయిదా పడింది. పిఠాపురం నియోజకవర్గ పర్యటన రేపు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడింది. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీ ఎన్నికలు ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరగనుండటంతో, ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. తొలిసారిగా సభ్యులే ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఓటింగ్ ద్వారా ఎన్నుకునే విధానాన్ని జనసేన అమలు చేస్తోంది.

Leave a Reply