మురుగు కాలువలను శుభ్రం చేయాలి..

మురుగు కాలువలను శుభ్రం చేయాలి..
- ఎడపల్లి గ్రామస్తుల డిమాండ్
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల కాలనిలో పంచాయతీ సిబ్బంది మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో ఎక్కడికక్కడ డ్రైనేజీలలో మురుగనీరు నిలిచిపోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిలిచిపోవడంతో దోమల ఉధృతి పెరుగుతుందని, తద్వారా పలు భయంకరమైన రోగాలు సంక్రమించే ఆస్కారం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వెంటనే పంచాయతీ సెక్రెటరీ చొరవ చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.
